Bhimavaram July 15:మెరుగైన విద్య బోధన ద్వారా విద్యార్థులను ప్రయోజకులను చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ ను కోరారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ డిఆర్ఓ ఛాంబర్ నందు జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో సమావేశమై కాంట్రాక్ట్ అధ్యాపకుల బదిలీలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ విద్యార్థులకు కళాశా స్థాయిలో మెరుగైన విద్యను అందిస్తే ప్రయోజకులవుతారని, ఇందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. కళాశాల స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వస్తే వారు ఆర్థికంగా మెరుగైన రీతిలో ఉండటంతో పాటు, కుటుంబానికి ఆసరాగా నిలుస్తారని అన్నారు. కళాశాలలో చేరడానికి వచ్చినప్పుడే ఏ కోర్సు అయితే వారికి ప్రయోజనం ఉంటుందో సూచనప్రాయంగా అవగాహన కల్పించాలన్నారు. డిగ్రీ చదువుతూనే వివిధ కంప్యూటర్ కోర్సులు నందు శిక్షణ పొందేలా చూడాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, నైపుణ్యా అభివృద్ధి పెంపొందించుకునేందుకు తగిన సూచనలు అందజేయాలని ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలో ఉన్న ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 26 మంది కాంటాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారని, వారు సర్వీస్ కొనసాగింపుకు చర్యలు తీసుకుంటున్నట్టు డిఆర్ఓ తెలిపారు.
ఈ సమావేశంలో పాలకొల్లు ఏ.ఎస్.ఎన్.ఎం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజరాజేశ్వరి, డిఎన్ఆర్ ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శోభారాణి, పెంటపాడు డి ఆర్ జి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు, దుంప గడప వివి గిరి కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ టి
యోగేశ్వరరావు, గణపవరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మల కుమారి, తణుకు ఎస్.సి.ఐ.ఎం కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ఆర్కే ఫణీంద్ర, భీమవరం ఆర్ ఆర్.డి.ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జ్ఞాన ప్రసూన్న పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in