Biryani:మటన్ బిర్యానీ చేసే విధానం
ముందుగా మనం బాగా కడిగిన ఒక కేజీ మటన్ ను కుక్కర్లో వేసుకొని దానిలో సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు నుండి 5 రిజల్ట్స్ వచ్చే అంతవరకు ఉంచండి.
ఈలోపు ఒక గిన్నెలో బాగా సన్నగా పొడవుగా కోసిన ఉల్లిపాయలను నూనెలో బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వాలి.
బాగా వేగిన ఉల్లిపాయలను ఒక గిన్నెలోకి తీసుకోండి. తరువాత మటన్ బాగా ఉడికిందో లేదో చూసుకుని మటన్ ను ఒక గిన్నెలోకి తీసుకోండి.
దానిలో నాలుగు బిర్యానీ ఆకులు, నాలుగు దాల్చిన చెక్క ,నాలుగు యాలక్కాయలు, నాలుగు లవంగాలు ,కొంచెం షాజీరా ,జాపత్రి, జాజికాయ మొదలైన బిర్యాని సామాన్లు వేయండి.
రుచికి సరిపడే ఉప్పు కారం పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 1/2 స్పూన్ గరం మసాలా ,1 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేయించిన
ఉల్లిపాయ ముక్కలను మూడు స్పూన్ల పెరుగును, కొత్తిమీర, పుదీనా కాస్త కస్తూరి మేతిని కూడా నలిపి వేయండి.
కస్తూరి మేతి బిర్యానికి మంచి రుచిని ఇస్తుంది.చివరిగా ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేయండి ఇవి అన్ని వేసిన తరువాత ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టండి.
దీనివలన ఆ మిశ్రమం కు మటన్ బాగా పట్టి బిర్యాని రుచిగా ఉంటుంది. తరువాత గిన్నె తీసుకొని నూనె వేసి తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసి ఉడికేంతవరకు ఉంచండి.
ఓ పక్క ఒక కేజీ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కేజీ బియ్యానికి ఒకటిన్నర లీటర్ల నీటిని వేసి
స్టవ్ మీద పెట్టి దానిలో మూడు బిర్యానీ ఆకులు, రెండు దాల్చిన చెక్క ,రెండు యాలక్కాయలు, మూడు లవంగాలు, కొంచెం షాజీరా, జాపత్రి ,జాజికాయ మొదలైన బిర్యాని సామాన్లు వేసి చిన్న స్పూన్ బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి బియ్యానికి సరిపడే ఉప్పు వేసి ఎనభై శాతం వరకు బియ్యం ఉడకనివ్వాలి.
తరువాత స్టవ్ కట్టేయండి.
ఇప్పుడు ఒక పొడవాటి పెద్ద గిన్నెలో ముందు తయారు చేసుకున్న మిశ్రమాన్ని సగం వేయండి.
దానిపై ఉడికిన అన్నాన్ని సగం వేయండి దానిపై కొత్తిమీర ,పుదీనా వేయించిన ఉల్లిపాయలను కొంచెం వేయండి.
తరువాత మిగిలిన మిశ్రమాన్ని అన్నాన్ని వేసి దానిపై మిగిలిన కొత్తిమీర, పుదీనా వేయించిన ఉల్లిపాయలను నెయ్యిని కూడా వేసి అలా పది నుంచి 15 నిమిషాలు ఉంచి స్టవ్ కట్టేయండి.
అంతే వేడి వేడి నోరూరించే మటన్ బిర్యానీ తయార్. మరి ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి గా సర్వ్ చేసుకొని లాగించేయండి
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in