black heads:బ్లాక్ హెడ్స్ తగ్గిద్దాం చాలామంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల్లో బ్లాక్ హెడ్స్ ఒకటి. ఇంట్లో పదార్థాలతో వీటిని సులువుగా ఎలా తగ్గించుకోవచ్చో చూద్దామా.
రోజులో తప్పనిసరిగా రెండు,మూడు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత తప్పక కడుక్కోవాలి.
ఆయిల్ ఫ్రీ, సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. మృత కణాలను ఎప్పటికప్పుడు తొలగించి ఆవిరి పట్టడం మేలు. ఇవన్నీ చేస్తేనే ఈ ప్యాక్ లు ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.
చక్కెర బాదం నూనె
అరకప్పు చక్కెరలో, స్పూన్ బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
గుడ్డు- నిమ్మరసం
గుడ్డు తెల్ల సోన మాత్రమే తీసుకుని,దీంట్లో రెండు చెంచాల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మృదువుగా మర్దన చేయాలి. అది ఆరిపోయిన తరువాత మరోసారి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చ నీటితో కడిగేయాలి.
తేనే -ఉప్పు
నిమ్మరసం చర్మంపై మురికిని తొలగిస్తే, ఉప్పు స్క్రబ్ లాగా పనిచేస్తుంది. తేనె చర్మానికి పోషణ ఇచ్చే మెరుపుని ఇస్తుంది. ఐదు నిమిషాల తరువాత గోరువెచ్చ నీటితో కడిగేయాలి. వారంలో రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాలతో బ్లాక్ హెడ్స్ రాకుండా చేసుకోవచ్చు.