Brown Sugar:చర్మ ఛాయను పెంచే బ్రౌన్ షుగర్ బెల్లం నుంచి నేరుగా తయారు చేసే ఈ చక్కెరలో పోషక విలువలు ఎక్కువ.
దీన్ని సౌందర్య పోషణాల్లో వాడితే చర్మం నిగరింపుతో మెరిసిపోతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రౌన్ షుగర్ చర్మంపై పేర్కొన్న మృత కణాలను తొలగించి, కొత్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ముఖం అందంగా మెరిసిపోయేలా చేస్తుంది.
ఇందుకోసం ఈ చక్కెరలో కాస్త నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసుకొని, నురగలా రుద్ది స్నానం చేస్తే చాలు.
పావు కప్పు బొప్పాయి గుజ్జులో, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ చేర్చి ముఖం, మెడ పై రాసి సవ్య, అపసవ్య దిశలో మర్దన చెయ్యాలి.
ఇలా చేస్తే టాన్ తగ్గి చర్మ రంగు పెరుగుతుంది. ఇందులోని గ్లైకోలిక్ యాసిడ్ చర్మం పై మచ్చలు తొలగిస్తుంది.
తక్కువ సమయంలో ముఖం నిగారింపు కనిపించాలని భావిస్తే, బ్రౌన్ షుగర్ లో కొద్దిగా తేనెను కలిపి ముఖంపై రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in