CM Relief Fund:ఏలూరు/నూజివీడు,మార్చి 9:అనారోగ్యాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం వంటిది అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
నూజివీడు పార్టీ కార్యాలయంలో 90 మంది లబ్ధిదారులకు రూ.65.54 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నిరుపేదల అభివృద్దే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు.

ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆపద్భందువునిగా అదుకుంటుందని ఆయన తెలిపారు. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మొదటి విడతలో 161 సేవలను వాట్సప్ ద్వారా అందించనున్నారన్నారు.ఈ తొలి విడతలో సీఎంఆర్ఎఫ్,
దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, మున్సిపల్ శాఖలలోని సేవలను చేరవేస్తుందని వ్యాఖ్యానించారు. నియోజవర్గ వ్యాప్తంగా ప్రజలు ప్రమాదాలకు గురైన, అనారోగ్యాలపాలై ఆసుపత్రుల్లో చేరిన తమకు సమాచారం ఇవ్వాలని విన్నవించారు. నియోజకవర్గ ప్రజల క్షేమమే తమకు ధైర్యం అని ఉపోద్ఘాటించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in