Collector Bhimavaram:బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లాలోని యువతకు ఉద్యోగ కల్పనపై స్కిల్ డెవలప్మెంట్ అధికారితో సమావేశమై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగాలు కల్పించేదిగా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. అందుబాటులో వున్న ప్రముఖ పరిశ్రమలు, కంపెనీలు యాజమాన్యాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి అవసరమైన సిబ్బంది వివరాలను సేకరించాలన్నారు. మన జిల్లాలో యువత ఎటువంటి ఉద్యోగాలు కోరుకుంటున్నారు, వారికి ఉన్న అర్హతలు ఏంటి అనే సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు. అన్ని వివరాలను క్రోడీకరించి ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా నియామకాలను చేపట్టేందుకు రానున్న 15 రోజుల్లో జాబ్ మేళాను నిర్వహించి నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎ.కృష్ణారెడ్డి, నేషనల్ కెరీర్ సర్వీసెస్ ఎంప్లాయిమెంట్ యూత్ ప్రొఫెషనల్ ఎం.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in