Cooking:ఉడికించడానికి ఓ లెక్కుంది ఉడికించడానికి నిర్ణీత సమయం ఉంటుంది. అంత సమయంలోనే వాటిని వండాలి. ఎక్కువ నీళ్లతో ఉడికిస్తే కాయగూరల నుంచి సి, బి, ఏ, విటమిన్లు త్వరగా కోల్పోతాం.
ఉడికించిన కాయగూరల్ని త్వరగా చల్లచేందుకు చల్లని నీళ్లలో వేస్తాం. ఇలా చేసిన, పోషకాలన్నీ కోల్పోతాం. బాగా చల్లటి నీళ్లు పోషకాలు అన్ని దూరం చేస్తాయి.
అందుకే వెడల్పాటి పళ్లెంలో ఉంచితే చాలు. పాలకూర, తోటకూర ఇలా ఆకుకూరలు ఉడికించేటప్పుడు కొద్దిగా నిమ్మరసం జోడిస్తే మంచిది.
కారణం ఆకుకూరల్లోని ఐరన్ సాధారణ పద్ధతిలో వండితే మనకు చేరదు. అదే విటమిన్ సి చేరితే మనకు ఐరన్ లోపం రాకుండా ఉంటుంది.
తరిగేటప్పుడు కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి కాకుండా సమానంగా తరిగితే ఒకేసారి ఉడుకుతాయి. సమయం కలిసి వస్తుంది.
ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే కాయగూరల్ని ఉడికించేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెడితే అవి రంగు కోల్పోయి చూడడానికి బాగుండవు.
ఉడికించే సమయంలో నీళ్లు అయిపోయాయి అనుకోండి. అప్పుడు చల్లని నీళ్లు కాకుండా వేడి నీళ్లు పోయాలి. ఇలా చేస్తే సమయం తక్కువ పడుతుంది. కాయగూరలు రుచి పెరుగుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in