Cool Drinks:కూల్ డ్రింక్ కదా అని తాగితే వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఐదు నిమిషాలు బయటకు వెళ్లి వస్తే చాలు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. వెంటనే మన కళ్ళ ముందు కదిలేవి నురగలు కక్కే కూల్ డ్రింక్స్ అయితే వీటిని తాగటం వల్ల అనేక రకాలు సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.
వేసవిలో తప్పనిసరి అయితే మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మకాయ రసం, కొబ్బరి నీళ్లు, వంటివి తీసుకోవాలని వీలైనంతవరకు కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళవద్దని చెబుతున్నారు. అసలు కూల్ డ్రింక్స్ వల్ల కలిగే అనర్ధాలు ఏమిటో చూద్దాం.
గుండె జబ్బులు: కూల్ డ్రింక్స్ కు తీపిచ్చే ప్రక్టోజ్ వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వీటిలో మొదటిది మెటబాలిక్ డిస్టబెన్స్ అంటే మన శరీరం శక్తిని ఖర్చు చేసే క్రమంలో మార్పులు వస్తాయి. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఎక్కువ కాలం పాటు రక్తపోటును నియంత్రించకపోతే గుండె జబ్బులు వస్తాయి. కొన్నిసార్లు దీనికి అనుబంధంగా కాలేయ సమస్యలు కూడా తలెత్తవచ్చు.
వ్యసనంగా మారి: తీపి తిన్నప్పుడు మెదడులో డుపమైన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ వల్ల మనకు ఎక్కువగా తీపి తినాలనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ తాగితే ఈ డోపమాన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది అలవాటుగా మారితే ఎప్పుడైనా ఒత్తిడి ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ ను తాగాలనిపిస్తుంది. ఇది ఒక వ్యసనంగా మారుతుంది.
ఎముకలు గొల్ల బారటం
శీతాల పానీయాలు ఎక్కువగా తాగినప్పుడు విసర్జించే మూత్రంలో పాస్పరిక్ యాసిడ్ తో పాటుగా కాల్షియన్ని కూడా జీర్ణ వ్యవస్థ శరీరం బయటకు పంపిస్తుంది. సాధారణంగా ఈ కాల్షియం మన శరీరానికి ఆహారం ద్వారా లభిస్తుంది. ఇలా లభించిన కాల్షియం ఈ పానీయాలు వల్ల జరగకుండా మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోవటం వల్ల ఎముకలకు తగినంత కాల్షియం అందదు. ఇది దీర్ఘకాలంలో ఎముకల గొల్లభారటం ప్రభావం చూపుతుంది. ఆస్టియో పోరోసిన్ వంటి వ్యాధులకు కారణమవుతుంది.
మూత్రపిండాల సమస్యలు
కూల్ డ్రింక్స్ ఫాస్పరిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. దీని పరిమాణం పెరిగితే మూత్రపిండాల్లో రాళ్లు తయారవుతాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువగా త్రాగే వారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం మనం గమనించవచ్చు.
పునరుత్పత్తి సమస్యలు
కూల్ డ్రింక్స్ లో క్యాన్స లో రెసిపీ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశిస్తే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. వీటిలో ప్రధానమైనది పునరుత్పత్తి సమస్య అందుకే గర్భాశయం గర్భిణీలు కూల్ డ్రింక్స్ తాగవద్దని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు.
కాలేయం లో కొవ్వు
మనకు శక్తి కావాలంటే గ్లూకోజ్ తప్పనిసరి. శరీరంలోకి ప్రవేశించే గ్లూకోజ్ ను కాలేయం శక్తిగా మార్చుకుంటాయి. కానీ కూల్ డ్రింక్స్ చక్కెర రూపంలో ఉండే ప్రాక్టోస్ కణాలు శక్తిగా మార్చుకోలేవు .దీంతో ఈ ప్రక్రోజ్ బాధ్యత కాలేయం పై పడుతుంది. అవసరానికి మించి ప్రక్టోజ్ శరీరంలో చేరుతూ ఉంటే ఇదంతా కాలేయం లో చేరి కొవ్వుగా మారుతుంది. ఇలా పెరిగిన కొవ్వులో కొంత శాతం రక్తం లోకి ప్రవేశిస్తుంది. మిగిలినది కాలేయంలోనే ఉండిపోతుంది. ఇలా కొవ్వు పట్టిన కాలయాన్ని నానా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఆల్కహాల్ తాగటం వల్ల కాలేయం కి ఎంత ప్రమాదమో కూల్ డ్రింక్స్ ని ఎక్కువ కాలం తాగినా కూడా అంతే ప్రమాదం.
ఉబ్బసం
శీతల పానీయాలు తాగే వారిలో ఉబ్బసం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. సాధారణంగా కూల్డ్రింక్స్ లో సోడియం బెంజాయిట్ అనే రసాయాన్ని ఎక్కువ కాలం నిలవ ఉండటానికి వాడతారు. ఇది మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రెండు ప్రమాదకరమైన సమస్యలు ఏర్పడతాయి. వీటిలో మొదటిది ప్రోటోసియం సమస్య బెంజాయిటీ ఇతర ఆహారంతో కలిసినప్పుడు రకరకాల మార్పులు జరుగుతాయి . ప్రోటోసియాన్ని శరీరం గ్రహించదు.ఉబ్బసానికి ఇది తొలి మెట్టు, ఇదే విధంగా తరచూ కూల్డ్రింక్స్ తాగే వారి దంతాలపై ఉన్న పై పొర దెబ్బతింటుంది.
స్థూలకాయం
కూల్ డ్రింక్స్ ని తరచుగా తాగే వారు స్థూలకాయలు అయి ఉంటారు. దీనికి కారణం శరీరంలో అవసరమైన దాని కన్నా ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం ఈ కొవ్వును కరిగించే అంత శ్రమ చేయకపోతే ఇది నడుము పిరుదుల భాగంలో పేరుకు పోతుంది. ఆ తర్వాత శరీరంలోని ఇతర భాగాలకు కూడా చేరి స్థూలకాయం ఏర్పడుతుంది.
కీళ్ల నొప్పులు
మన శరీరంలో యూరిక్ యాసిడ్ బాగా పెరిగినప్పుడు అది కీళ్ల మధ్యకు చేరుకుంటుంది. దీనివల్ల గోబ్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వచ్చినవారికి పాదాల్లోకి బొటనవేలు కీళ్లు వాచిపోతాయి. విపరీతమైన నొప్పి కలుగుతుంది. శరీరంలోని యూరిక్ యాసిడ్ బాగా పెరగడానికి ప్రక్టోజ్ ఒక ప్రధానమైన కారణం అని వైద్య పరిశోధనలో తేలింది. ప్రక్టోజ్ శరీరంలోకి కూల్డ్రింక్స్ ద్వారా చేరుతుంది. కాబట్టి వాటిని తాగటం మానేయటం ఉత్తమం.
మతిమరుపు
శరీరంలో చక్కెర స్థాయి హఠాత్తుగా విపరీతంగా పెరిగిపోతే ఆ ప్రభావం మెదడులోని న్యూరాలపై పడుతుంది. ఇది ఎక్కువ సార్లు జరిగితే న్యూరాల పనితీరు దెబ్బతింటుంది. మతిమరుపు సమస్య ఏర్పడుతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in