Dandruff Home Remedies:చుండ్రు పోతుంది ఇలా, కొందరిని చుండ్రు సమస్య చాలా వేధిస్తుంది. వాళ్లు రకరకాల షాంపూలు ప్రయత్నించి విప్లమవుతుంటారు.
అయితే ఈ సమస్యను సింపుల్ హోమ్ రెమెడీస్ తో దూరం చేసుకోవచ్చు. చుండ్రు వదలాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపొండి. ఆలివ్ ఆయిల్ లో సహజసిద్ధంగా చుండ్రులు తొలగించే గుణాలు ఉన్నాయి.
వారంలో రెండు రోజులు తలకు ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ని పట్టించి తల చుట్టూ టవల్ లేక షవర్ క్యాప్ పెట్టుకొని పడుకోవాలి. ఉదయాన్నే ఏదైనా షాంపుతో తల స్నానం చేస్తే సరి.
నిమ్మ ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. కొన్ని నిమ్మ ఆకులను తీసుకొని అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆకులను పేస్ట్ మాదిరిగా చేసుకొని తలకు పట్టించాలి. 40 నిమిషాల పాటు అలా వదిలేసి తరువాత నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.
.
ప్రతి ఇంట్లోనూ కలబంద మొక్క ఉంటుంది. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రులు సమర్థవంతంగా తొలగిస్తాయి. తలకు అలివేరా జెల్ ను పట్టించి నలభై నిమిషాలు వదిలేయాలి. తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒక్కసారి ఇలా చేస్తే చుండ్రు సమస్య దూరం అవుతుంది.
గుప్పెడు మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్టు మాదిరిగా చేసుకొని తలకు పట్టించాలి. అరగంట పాటు ఇలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటిలో తల స్నానం చేయాలి. వారానికి ఒక్కసారి నెలపాటు చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in