Dark Circles Reducing Tips:కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గించే సింపుల్ చిట్కాలు!
కీరదోస
కీరా దోసను ఆరోగ్యానికే కాదు అందం కోసం ఉపయోగించవచ్చు. తాజాకిర దోస మొక్కలను సన్నగా, అడ్డంగా కట్ చేసి కళ్ళ మీద ఉంచుకోవాలి. ఇలా 15 నిమిషాలు చేస్తే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.
చల్లటి టీ బ్యాగ్
గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్నవారు ఈ టీ బ్యాగ్ వృధా చేయకుండా కళ్ళ కింద డాక్సర్ కి తగ్గించడం కోసం ఉపయోగించవచ్చు. ఈటీవీ ఆగిన కాసేపు రిఫ్రిజిరేటర్ లో ఉంచి కళ్ళపై పెట్టుకోవాలి. ఇలా 10-15 నిమిషాలు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
బంగాళదుంప ముక్కలు
కళ్ళ కింద డార్క్ సరిగా తగ్గడంలో బంగాళదుంప ముక్కలు కూడా సహాయపడతాయి. బంగాళదుంప ముక్కలను సన్నగా కోసి కళ్ళపై పెట్టుకుని 15 నిమిషాలు ఉంచాలి. దీనిలోని బ్లీచింగ్ గుణాలు నల్లటి వలయాలు తొలగిస్తాయి.
బాదం నూనె
లో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మాయిశ్చరైసర్ గా పనిచేసి డాక్టర్ సర్కిల్స్ తగ్గిస్తుంది. దీనికోసం కొద్ది చుక్కల బాదం నూనె తీసుకొని కళ్ళకింద రాసి మసాజ్ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పాలు
కాటన్ బాల్ తీసుకొని దానిని చల్లటి పాలలో కాసేపు ఉంచాలి.తర్వాత దీన్ని కళ్ళపై ఉంచి 20 నిమిషాలు ఉండాలి.దీనివల్ల చర్మం ఉబ్బడం, నల్లటి వలయాలు తొలగిపోతాయి.
టమాటో గుజ్జు
టమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.దీని కోసం టమాటోను పేస్ట్ చేసి దీనిని కళ్ళకింద రాసుకొని మసాజ్ చేయాలి.కాసేపు ఉంచి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మంచి నిద్ర
కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం. దీనిని అధిగమించేందుకు ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రించేలా ప్లాన్ చేసుకోండి.దీని కోసం యోగా, మెడిటేషన్ చేయడం చాలా అవసరం.
సన్ స్క్రీన్
నల్లటి వలయాలు ఏర్పడకుండా ఉండాలంటే బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది. ఇది సూర్యకిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
వాటర్
కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ నివారించడంలో వాటర్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి.ప్రతిరోజు తగ్గినన్ని నీళ్లు తాగడం ద్వారా చర్మం మడతలు పడటం కళ్ళ కింద నల్లటి వలయాలు రాకుండా ఉంటాయి.