Datri Reddy IAS:ఏలూరు,జూలై,24:జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా నియమితులైన పి. ధాత్రిరెడ్డి బుధవారం ఉదయం జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధుల్లో చేరిన ధాత్రి రెడ్డికి కలెక్టర్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
పాడేరు సబ్ కలెక్టర్ గా పనిచేస్తున్న ధాత్రి రెడ్డి ఏలూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్ల బావి గ్రామానికి చెందిన ధాత్రి రెడ్డి 2019లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్ శిక్షణ సమయంలో మళ్లీ సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 46వ ర్యాంక్ సాధించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in