Denduluru:దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో గాడి తప్పిన పారిశుద్ధ్య వ్యవస్థపై సత్వరమే చర్యలు చేపట్టండి :MLA,చింతమనేని.ప్రభాకర్
అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచన
దుగ్గిరాల లోని తన క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించిన జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్ సహా నియోజకవర్గ పరిధిలోని పలువురు మండల అభివృద్ధి అధికారులు సిబ్బంది..
ఈ సందర్భంగా అధికారులతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ “గత ఐదేళ్ల వైసిపి పాలనలో దెందులూరు నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధి చెందక కనీస పారిశుద్ధ్య పనులు కూడా సక్రమంగా అమలు కాక ప్రజలు ఎంతో అవస్థలు పాలయ్యారని అన్నారు.
ఇకపై దెందులూరు నియోజకవర్గంలోని ఏ గ్రామాన కూడా ప్రజలకు అటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా పారిశుధ్యానికి అత్యధిక ప్రాధన్యత ఇచ్చేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చర్యలు చేపట్టాలని చింతమనేని ప్రభాకర్ సూచించారు.
గ్రామాల్లో డ్రెయిన్లు పూడికతీత, చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల నిర్వహణ, ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశుభ్రపరచడం, ప్రజలకు శుభ్రమైన మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టడంవంటి పనులు సత్వరమే చేపట్టాలని చింతమనేని ప్రభాకర్ అధికారులకు సూచించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in