Drinking hot water:వేడి నీళ్లు మాయాజాలం మనకు పోషకాహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే అవసరం. శీతాకాలం, వర్షాకాలంలో మామూలు నీళ్లే తాగిన ఎండాకాలం చల్లటి నీళ్లు తాగి సేద తీరుతాం.
ఏ కాలంలోనైనా రోజుకు రెండు లీటర్ల త్రాగమని అవి గోరువెచ్చగా ఉంటే మరింత శ్రేష్టమని హితువు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది ఎంత ప్రయోజనమో ఇల్లాలికి అర్థమైతే ఒక ఇంటిల్లిపాది వెచ్చటి నీళ్లు తాగేలా చూడటం తథ్యం.
నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చటి నీళ్లతో పరిష్కారం అవుతాయి. ఆ సమయంలో కలిగే విసుగు, అలసట తగ్గుతాయి. మొటిమలు రావు. చుండ్రు రాదు. జుట్టు రాలదు. కుదుర్లు బడపడతాయి. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం వేసుకొని తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.
కొందరికి ముఖంలో ముడతలు వచ్చి ఎక్కువ వయసు వారిలా కనిపిస్తుంటారు. ఉదయాన్నే రెండు గ్లాసుల వెచ్చటి నీళ్లు త్రాగడం అలవాటు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.
. పరగడుపున అది ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు త్రాగడం మంచిది. అలాంటప్పుడు నీళ్లు గోరువెచ్చగా ఉంటే సహించకపోవడం లాంటి ఇబ్బంది లేకుండా సులువుగా తాగేయొచ్చు.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీరు తాగితే బద్ధకం తగ్గి ఉల్లాసంగా ఉంటుంది. శరీరం వేడి పుంజుకుంటుంది. ముక్కు దిబ్బడ, గొంతు కూడుకుపోవడం, మాటల్లో జీర,శ్వాస ఇబ్బందులు నయమవుతాయి. చలి, వణుకు వంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇట్టే తగ్గిపోతాయి.
వెచ్చటి నీళ్లతో అవయవాలు అన్ని ఉత్తేజమవుతాయి. కండరాలు బిగుసుకుపోయి జీర్ణ ప్రక్రియను వృద్ధి చేసి మలబద్ధక సమస్యలు నివారిస్తాయి.
నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో మలినాలన్నీ వెళ్ళిపోతాయి.
శరీరం పొడిబారదు. ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది. అందుకే రోజు రెండు లీటర్లు అయినా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in