Drugs:ఏలూరు, ఆగష్టు, 13 : సమాజ శ్రేయస్సు కొరకు మాదక ద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
“నాషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో బాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలపై మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీ ని జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ యువత ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తిగా రూపుమాపేందుకు ఉద్యమంలా ప్రతీ ఒక్కరూ కదిలి రావాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, నాటు సారా అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, మాదకద్రవ్యాలను సరఫరా చేసే పెడ్లర్స్ ను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాలు సరఫరా చేసే వారిపై ఇంతవరకు 149 కేసులు నమోదు చేసి, 540 మందిని అరెస్ట్ చేశామన్నారు. జిల్లా యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్ధేందుకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమైనదని, ప్రతీ ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగాన్ని జిల్లాలో పూర్తి రూపుమాపేందుకు కంకణబద్దులు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగాలపై ఫిర్యాదుల నమోదు, డి-అడిషన్ కేంద్రాల సేవల నిమిత్తం టోల్ ఫ్రీ నెంబర్ 14446 ఏర్పాటుచేయటమైనదని, ఈ నెంబర్ ఫోన్ చేసి తమ సమస్యలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చన్నారు. మాదకద్రవ్యాల వ్యసనం నుండి విముక్తులను చేసేందుకు ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డి-అడిక్షన్ సెంటర్ ను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏ ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగంపై ప్రభావితులు కావద్దని సూచించారు. మాదకద్రవ్యాల దుష్ర్పభావలపై జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి నేతృత్వంలో పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. మాదక ద్రవ్యాలు సరఫరా, వినియోగించే వారి సమాచారాన్ని తెలియజేసేవారికి రివార్డులు కూడా ప్రకటించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి సమాచారాన్ని అందించి సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. మెడికల్ షాపుల్లో మత్తుకు సంబంధించి ఏవిధమైన మందులు విక్రయించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. నూజివీడులో ట్రిపుల్ ఐటి, జిల్లాలోని వివిధ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసి మాదక ద్రవ్యాల వినియోగానికి తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి , జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, ఆర్డీఓ ఎన్. ఎస్. కె. ఖాజావలి, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎడి రాకడ మణి, ట్రాన్స్ కో ఎస్ఇ పి. సాల్మన్ రాజు, ఎస్డీసీ లు ఎం. ముక్కంటి, కె. బాబ్జి, ఐసిడిఎస్ పీడీ పద్మావతి, ఎపిఎంఐపి పిడి రవికుమార్, ఏలూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా. మాలతీ, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఘంటా సుధాకర్, జిల్లా విద్యా శాఖాధికారి అబ్రహం, వివిధ శాఖల అధాకారులు, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in