Eluru:ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కు అభినందనలు తెలిపిన మానవత ఏలూరు యూనిట్
ఏలూరు, మే, 15…ఏలూరు జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగిన సందర్బంగా మానవత ఏలూరు యూనిట్ వారు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా మానవత ఏలూరు యూనిట్ అధ్యక్షుడు మేతర అజేయ్ బాబు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం నుంచి జిల్లా అంతటా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంచేసి ప్రభుత్వ అధికారులకు ఎన్నికల నిర్వహణ అంశాలపై మార్గదర్శకాలను ఇస్తూ పోలింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, పొరపాట్లు జరుగకుండా తగు జాగ్రత్తతో మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల సజావుగా నిర్వహించినందుకు జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ వారికి మానవత ఏలూరు యూనిట్ వారు అభినందనలు తెలియజేసినట్లు చెప్పారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in
అభినందనలు తెలిపిన వారిలో మానవత ఏలూరు యూనిట్ రీజనల్ చైర్మన్ పోలవరపు దేవ రత్నాకరరావు , యూనిట్ చైర్ పర్సన్ అడుగుమిల్ల నిర్మల , సభ్యులు అల్లూరి మోహిని, మేడికొండ పద్మజ, డి. భారతి, వై. విష్ణు, అగ్గాల కోహాదిం తదితరులు ఉన్నారు.