Eluru: జూలై, 16….కోవిడ్ కారణం గా తల్లిదండ్రులు ను కోల్పోయి అనాధలు గా మిగిలి పోయిన 55 మంది బాలల లో 18 సం లు వయస్సు దాటిన
19 మంది బాలల కూ, ఇంటర్మీడియట్ పూర్తి చేసి వృత్తి విద్యలలో పాల్గొనలనుకునే 8 మంది బాలలు మొత్తం గా 27 మందికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అందుబాటు లో ఉన్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండెడ్ ఆఫీసర్ ఎన్ సందీప్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు, స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ కె. వేట్రి సెల్వి మాట్లాడుతు పిల్లలు వారి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధముగా తీర్చిదిద్దు కోవటానికి కేవలం ఇంటర్మీడియట్ అర్హత తో ఎయిర్ ఫోర్స్ లో ఇంత మంచి అవకాశం రావటం అదృష్టమన్నారు. మూడు స్థాయిలలో నిర్వహించే సెలెక్షన్ ప్రోసెస్ లో పాల్గొనీ ఫైనల్ గా సెలెక్ట్ అయితే మంచి భవిష్యత్తు పొందుతారని పిల్లలను ఉత్సాహ పరిచారు. కార్యక్రమంలో పిడి ఐసీడీఎస్ కె పద్మావతి, జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సి హెచ్ సూర్య చక్ర వేణి పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in