Eluru July 13: ఏలూరులో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని మోడరన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులను సమకూర్చడానికి కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రినీ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాల్లో రోగుల వద్దకు నేరుగా వెళ్లి వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయో, వారిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో దోమలు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని జనరల్ వార్డు నుంచి అన్ని విభాగాలు కూడా ఏసీలు ఉండాలని ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తానని ఎంత బడ్జెట్ అవసరమో మూడు రోజుల్లోగా తగిన నివేదిక తనకు అందించాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధికి, మోడరన్ ఆసుపత్రిగా తీర్చిదిద్దరడానికి ఎన్ని నిధులు అవసరమైన రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి, టాటా కంపెనీ వారి సహకారంతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో ఏ ఏ వైద్య పరికరాలు అవసరమో వాటి వివరాలను తమ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. ఏపీ ఎస్ ఎం ఐ డి సి ఇంజనీర్ అయిన రాజబాబు నుంచి ఆసుపత్రి అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తగిన నివేదిక అందించాలని ఆయనను ఆదేశించారు. కంటి విభాగానికి ఆపరేషన్ చేసే నిమిత్తం వైద్యపరికరాలు అవసరమని డాక్టర్ ఎస్ రామ్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కచ్చితంగా సమకూరుస్తానని హామీ ఇచ్చారు .తాను ప్రతినెల ఆసుపత్రిని సందర్శిస్తానని ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా జిల్లాలోని ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. అవసరమైన సిబ్బంది వైద్యులు నియమించుకునేందుకు సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటాను అన్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 330 పడకల మాత్రమే అనుమతి ఉందని దీనిని మరింత పెంచడానికి కృషి చేస్తానన్నారు. ట్రామా కేర్ విభాగాన్ని పరిశీలించిన అనంతరం ఆ విభాగం స్టాఫ్ నర్సులు సిబ్బంది ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సత్కరించారు.
ఎంపీ తోపాటు ఆసుపత్రి ఇంచార్జ్ మెడికల్ సుపరిండెంటెంట్ డాక్టర్ పిఏ ఆర్ఎస్ శ్రీనివాస్, ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాదరెడ్డి, డిప్యూటీ మెడికల్ సూపర్నెంట్ డాక్టర్ మల్లికార్జునరావు, డాక్టర్ డాక్టర్ రవికుమార్ పలువురు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in