Eluru:కౌంటింగ్ సిబ్బంది తొలి ర్యాండమైజేషన్ పూర్తి ఏలూరు, మే, 24…సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపుకు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఏలూరు పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కౌంటింగ్ ప్రక్రియకు 289 మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు ,340 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 309 మంది మైక్రో అబ్జర్వర్లు మొత్తంగా 938 మంది కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పారదర్శకంగా ఎన్ఐసి సాప్ట్ వేర్ ఆన్ లైన్లో పూర్తిచేశామని తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పామణి, కలెక్టరేట్ ఏవో కె. కాశీ
విశ్వేశ్వరరావు, ఎన్ఐసి డిఐఓ శర్మ, తదితరులు పాల్గొన్నారు.