Read Time:3 Minute, 42 Second
Eluru:జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు నకు పక్కా ప్రణాళికతో చర్యలు- జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
రాష్ట్రాల సీఈఓ లు, ఆర్ ఓ లతో కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
ఏలూరు, మే, 27 : జిల్లాలో జూన్, 4వ తేదీన చేపట్టనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రశాంతవాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కు చెప్పారు. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి సోమవారం కేంద్ర ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్, డా.సుఖ్బీర్ సింగ్ సందు తో కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ వివిధ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ జూన్, 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ఠమైన ప్రణాళికతో నిర్వహించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ రాష్ట్రాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో మినహా పలు రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సిబ్బంది ప్రశాంత వాతావరణంలో నిర్వహించారని, ఎటువంటి సమస్యలు లేకుండా పోలింగ్ నిర్వహించిన ఎన్నికల సిబ్బందిని ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ అభినందించారు. అదే స్పూర్తితో ఎటువంటి శాంతి భద్రతల సమస్య లేకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తిచేసేందుకు రిటర్నింగ్ అధికారులు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలన్నారు. కౌంటింగ్ కొరకు నియమించిన సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ అందించాలన్నారు. ఈవీఎం లను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను రిటర్నింగ్ అధికారులు ప్రతీ రోజు సందర్శించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతవాతావరణంలో ఓట్లు లెక్కింపు నకు చర్యలు చేపట్టామన్నారు
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in