Read Time:5 Minute, 3 Second
Eluru:ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు
శిక్షణా కార్యక్రమంలో సిబ్బందికి జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశం


ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు
శిక్షణా కార్యక్రమంలో సిబ్బందికి జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశం
ఏలూరు/వట్లూరు , మే, 27 : ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు చేయాలనీ జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కౌంటింగ్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో సోమవారం ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, డిఆర్ఓ డి. పుష్పమణి, రిటర్నింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల ప్రక్రియలో మొదటి భాగమైన పోలింగ్ ప్రక్రియను ప్రశాంతవాతావరణంలో నిర్వహించారని సిబ్బందిని అభినందిస్తూ, అదే స్పూర్తితో తదుపరి అంకమైన కౌంటింగ్ ప్రక్రియను కూడా పారదర్శకమైనరీతిలో ప్రశాంతవాతారణంలో నిర్వహించాలన్నారు. ఏలూరులోని సర్. సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జూన్, 4వ తేదీన ఉదయం 7 గంటల నుండి ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఓట్ల సంఖ్యను బట్టి 16 నుండి 21 రౌండ్ల వరకు కౌంటింగ్ ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది ఎటువంటి కంగారు, గందరగోళం లేకుండా ప్రశాంతమైన మనస్సుతో కౌంటింగ్ విధులకు హాజరు కావాలన్నారు. కౌంటింగ్ సిబ్బంది విధులకు సంబందించిన ర్యాండమైజేషన్ అదేరోజు ఉదయం 5 గంటలకు జరుగుతుందని, సిబ్బంది అందరూ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సెంటర్ వద్ద హాజరుకావాలన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద సిబ్బందికి ఉదయం అల్పాహారం ఏర్పాటుచేయడం జరిగిందని, అల్పాహారం అనంతం సిబ్బంది ర్యాండమైజేషన్ తమకు కేటాయించిన నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ సెంటర్ కు వెళ్లి రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. శిక్షణా సమయంలో అన్ని అంశాలపై క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలని, ఏదైనా సమస్య ఎదురైతా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, వాటిని సిబ్బందికి శిక్షణలో తెలియజేయడమే కాక, శిక్షణా ప్రదేశంలో ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం డెమో కూడా నిర్వహిస్తున్నామన్నారు. సరైన కారణం లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఓటును తిరస్కరించకూడన్నారు. సిబ్బంది డెమో ద్వారా మరింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. సిబ్బంది తమ సందేహాలను శిక్షణా అధికారి చక్రపాణి ని అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె. సుబ్బారావు, ఏలూరు ఆర్డీఓలు ఎన్ .ఎస్.కె. ఖాజావలి, కె. అద్దయ్య , వై. భవానీశంకరి, జిల్లా పంచాయతి అధికారితూతిక శ్రీనివాస విశ్వనాధ్, ముక్కంటి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, వివిధ శాఖల అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in