Eluru:కౌంటింగ్ కు పక్కా ఏర్పాట్లు. సుమారు వెయ్యి మందితో పారదర్శకంగా ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు.
కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్…
ఏలూరు,మే,28 : ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లను రెండు రోజుల్లో పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు.
స్థానిక సర్ సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను మంగళవారం జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్ఓ డి. పుష్పమణి తో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు.
కౌంటింగ్ హాలులో కౌంటింగ్ సిబ్బందికి ఓట్ల లెక్కింపునకు సౌకర్యవంతంగా సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ హాలులో ప్రతీ రౌండ్ కు ఏ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించేందుకు వీలుగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ నియోజకవర్గ కౌంటింగ్ హాలులో అసెంబ్లీ ఓట్లు లెక్కించేందుకు, ఆ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు లెక్కించేందుకు వీలుగా విడివిడిగా టేబుల్స్ ఏర్పాటుచేయాలన్నారు. ప్రతీ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాలుకు ఈవీఎం., వివి పాట్ లను తీసుకువచ్చేందుకు ప్రత్యేక త్రోవ ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాలులోనికి అనుమతి లేని ఇతరులు ఎవరికీ ప్రవేశం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ హాలులో పూర్తి ఏర్పాట్లు అన్ని రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం సుమారు వెయ్యిమంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్ వైజర్లు, శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.
కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు ఎం. ముక్కంటి, కె.భాస్కర్,ఏలూరు మునిసిపల్ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి. లక్ష్మీనారాయణ, పోలీసు అధికారులు, పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in