Eluru:నిరంతర నిఘా పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లు జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతితో కలిసి సంయుక్తంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్.
ఏలూరు,మే,28:ఎన్నికలు ముగియగానే ఈవిఎంలను అత్యంత భధ్రతా ఏర్పాట్లతో స్ట్రాంగ్ రూమ్ లో భధ్రపరచి నిరంతర నిఘాలో ఉంచడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
మంగళవారం స్ధానిక సర్.సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి,జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు.
స్ట్రాంగ్ రూమ్ లకు ఏర్పాటు చేసిన సీళ్లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్లలో వారు సంతకం చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భధ్రతా, సిసి కెమేరాల నిఘాలో ఉంచడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారులతోపాటు జిల్లా ఎస్పీ, తాము నిరంతర పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి అధికారులతో పరిశీలించి సందర్శకుల రిజిస్టర్ లో సంతకం చేశారు.
కలెక్టర్ వెంట రిటర్నింగ్ అధికారులు ఎం. ముక్కంటి, కె.భాస్కర్,ఏలూరు మునిసిపల్ కమీషనర్ ఎస్. వెంకటకృష్ణ, సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి. లక్ష్మీనారాయణ, పోలీసు అధికారులు, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in