Eluru:ఓట్లలెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు సంబంధిత అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు.
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్…
ఏలూరు,మే,31:జిల్లాలో జూన్ 4వ తేదీన నిర్వహించే ఓట్లలెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు సంబంధిత అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.
శుక్రవారం స్ధానిక సర్. సి.ఆర్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపుకు సంబందించి ఓట్ల లెక్కింపు కేంద్రంలో విధులు కేటాయించిన అధికారులు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులపై జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన విధులను వారు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సకాలంలో ఫలితాల రిపోర్టింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్లలెక్కింపురోజు ఉదయం 6.00 గంటల కల్లా కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి హాజరు కావాలని, దూర ప్రాంతాలవారయితే ముందురోజే వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ నుండి కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, కౌంటింగ్ హాలుకు పంపడంలో అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. కౌంటింగ్ హాలులోకి పోటీలోవున్న అభ్యర్ధి లేదా వారి ప్రధాన ఏజెంట్లో ఒకరిని మాత్రమే అనుమతించబడుతుందన్నారు. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్లను, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవన్నారు. ప్రతి కౌంటింగ్ హాలు వద్ద సర్కిల్ ఇన్స్పేక్టర్ స్ధాయి అధికారిని పర్యవేక్షక అధికారిగా నియమించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు పటిష్టమైన ప్లానింగ్ ను అమలు చేయాలన్నారు. కౌంటింగ్ హాలు పరిధిలో 1 నుంచి 2 కిలోమీటర్ల మేర ఎక్కడా ఎక్కువ జనసమూహం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమీపంలోని కళ్యాణమండపాలు, తదితరాలపై నిఘా ఉంచాలన్నారు. ప్రతి కౌంటింగ్ హాలు వెలుపల అగ్నిమాపక పరికరంతోపాటు ఫైర్ మేన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా కౌంటింగ్ సెంటరు వద్ద రెండు షిప్టులతో కూడిన వైద్య బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు మూడు అంబులెల్స్ లను సిద్దంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ కేంద్రంలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా జనరేటర్లను నిర్వహించాలన్నారు. లెక్కింపు కేంద్రంలో విధులు నిర్వర్తించే సిబ్బందికి సంబంధించి ర్యాండమైజేషన్ జూన్ 3వ తేదీన నిర్వహించి సంబంధిత శిక్షణ అందించాలన్నారు. కౌంటింగ్ పూర్తయిన పిదప ఈవిఎంలకు సరైన రీతిలో సీళ్లు వేసి, తిరిగి వాటిని జిల్లా కేంద్రంలోకి తరలించే ఏర్పాటు చేయాలన్నారు. మీడియా పాయింట్ వరకు మాత్రమే ఎన్నికల కమీషన్ జారీచేసిన గుర్తింపు కార్డుకలిగిన పాత్రికేయులకు సెల్ ఫోన్ అనుమతించ
బడతాయన్నారు. ఎట్టి పరిస్ధితుల్లోను ఈవిఎంలను జూమ్ చేసి చిత్రీకరించేందుకు అనుమతించబడవన్నారు. నిర్ధేశిత ప్రాంతంనుంచే కవరేజి చేసుకోవల్సివుంటుందన్నారు. నిర్ధేశించిన ప్రవేశ మార్గంలోనే కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్ధులు కౌంటింగ్ హాలుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ సిబ్బందికి సంబంధించి అల్పాహార, భోజన ఏర్పాట్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, అధనపు ఎస్పీ స్వరూపరాణి, ఐటిడిఎ పివో యం. సూర్యతేజ, డిఆర్ఓ డి. పుష్పమణి, రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్ కె ఖాజావలి, వై. భవానీ శంకరి, కె. భాస్కర్, కె. అద్దయ్య, యం. ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in