Eluru:ఏలూరు, జూన్, 2 : జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్, ఎస్. ఏ . రామన్ లకు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వివరించారు.
స్థానిక రెవిన్యూ అథిగృహంలో ఆదివారం ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. కృష్ణకాంత్ పాఠక్, ఎస్. ఏ . రామన్ లను జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 4వ తేదీన జరగనున్న ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు సంబంధించి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లను వివరించారు. ఈవీఎం లను కౌంటింగ్ హాలుకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక త్రోవ ఏర్పాటుచేశామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి నియోజకవర్గ కేటాయింపుపై మొదటి ర్యాండమైజేషన్ ను ఆదివారం సాయంత్రం పూర్తి చేస్తామని, కౌంటింగ్ టేబుల్ కేటాయింపుపై రెండవ ర్యాండమైజేషన్ ను 4వ తేదీ ఉదయం 6 గంటలకు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాలలో 200 మీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్త్ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ చెప్పారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి , ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, డిఆర్ఓ డి. పుష్పమణి, రిటర్నింగ్ అధికారులు ఎన్ .ఎస్. కె. ఖాజావలి, కె. అద్దయ్య , ఎం. ముక్కంటి, భాస్కర్, వై. భవానిశంకరి,ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in