Eluru:జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ ను సత్కరించిన ఎన్ జివో అసోషియేషన్
ఏలూరు,మే,17:ఏలూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్ వారిని శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎన్ జివోస్ అసోషియేషన్ వారు జిల్లా కలెక్టర్ ను కలిసి పూలమొక్క అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పోలింగ్ సిబ్బంది, మరి ముఖ్యంగా మహిళా ఉద్యోగులు బాగా పనిచేశారని కలెక్టర్ వారందరికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎన్ జివో అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, కలెక్టర్ తో మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ పరిధిలో వున్న అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గత ఎన్నికల పోలింగ్ కంటే ఎక్కువగా నమోదు అయిందని దీనికి మీరు తీసుకున్న నిర్ణయాలు, స్వీప్ ద్వారా ఓటర్లను చైతన్యం చేసి పోలింగ్ బూత్ వరకు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారని కలెక్టర్ కు తెలిపారు.
ఏలూరు తాలూకా అధ్యక్షుడు గొన్నోరి శ్రీధర్ రాజు, కార్యదర్శి కె. సత్యనారాయణ, జిల్లా ఎన్ జివోస్ నాయకులు నోరి శ్రీనివాస్, నారాయణ నాయుడు, నరేంద్ర, పూడి శ్రీనివాస్ , గంగాధర్, హరినారాయణ, మహిళా విభాగ సభ్యులు సత్య భారతి, మల్లిక, నాగమణి, జగదీశ్వరి, క్లాస్ ఫోర్ సంఘ నాయకులు వై. శ్రీనివాస్, ఎస్. శివ తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in