అందరివాడు గా బదిలీ పై వెళ్తున్న కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
మంచి మనసున్న కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్
అధికారుల బదిలీలు సహజం కానీ వారి ప్రస్థానం ఏలూరు ప్రజల మనసులో సుస్థిరం
అనాధులు నిస్సహాయులను చూస్తే చలించి పోయి అండగా నిలిచే సున్నిత మనస్తతత్వం ఆయన సొంతం
కష్టాల నుంచి కష్టపడి ఎదిగిన ఐఏఎస్ అధికారి వె.ప్రసన్న వెంకటేష్
ఎన్నికలలో ఆయన పాత్ర కీలకం… ఓటింగ్ శాతం పెరిగింది ఆయన ప్రణాళికతోనే
ఏలూరు/జూన్ 23: జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ 2022 జనవరి 26 న జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించి నాటి నుంచి జిల్లా యంత్రాంగంతో మమేకమై రాజీ పడకుండా పరిపాలన సాగించారు ,తన పని తీరుతో అటు సామాన్య ప్రజలలో సైతం అందరి మనిషిగా కలెక్టర్ విధులు నిర్వహిస్తూ ప్రజలు, ఇటు అధికారులు అందరలో చెరగని ముద్ర వేసుకున్న అధికారి ప్రసన్న వెంకటేష్. ప్రజల నుంచి వినతుల స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ వారి మన్ననలు పొందగలిగారు. పరిపాలనలో నిష్పక్షపాతంగా వ్యహరిస్తారని అన్ని వర్గాలలో మంచి పేరు ఉంది. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆయన తనదైన ముద్ర వేశారు. గతంలో గోదావరి వరదలు సంభవించిన సమయంలో సహాయ పునరావాస కేంద్రాలలో దగ్గర ఉండి పర్యవేక్షణ చేసి బాధితులకు అండగా నిలిచారు .అలాగే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో చురుకైన పాత్ర పోషించారు. గిరిజన ప్రాంతాలలో పౌష్టిక ఆహారం అందించేందుకు సరికొత్త పథకాన్ని అమలులో తీసుకొచ్చారు.
జిల్లా కలెక్టర్ గా వె.ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన కొన్ని ముఖ్యాంశాలను గుర్తు చేసుకుంటే..
వాటిలో ప్రధానంగా చారిత్రాత్మక ‘గోదావరి నదిలో వరదలు’ (గత 3-4 దశాబ్దాలలో కూడా అత్యధికం) రెండు సార్లు నిర్వహించ బడ్డాయి. వేలాది మందిని సకాలంలో రక్షించి, తరలించి సహాయక సేవలను అందించడంలో వె.ప్రసన్న వెంకటేష్ సేవలు మరువలేనివి.
మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం & పోషణపై దృష్టి సారించి,” ప్రాజెక్ట్ అక్షజ” సెయింట్ థెరిస్సా కళాశాల సహకారంతో, ఐటిడిఎ మండలాల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లలు & రక్తహీనత ఉన్న మహిళలకు సిఎస్ఆర్ చొరవ ద్వారా అనుబంధ పోషకాహారాన్ని అందించడంలో విశేష కృషి చేశారు. ఆ చొరవ యొక్క ఫలితం దాదాపు 30 శాతం మంది పిల్లలు & గర్భిణీ స్త్రీలు పోషకాహార లోపం & రక్తహీనత నుండి 5 నెలల్లోనే బయటపడ్డారు. పేదలు మరియు వృద్ధుల ఫిర్యాదుల పరిష్కారం పైనా కలెక్టర్ మనస్సు తో దృష్టి సారించారు.
అదేవిధంగా “పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ కోసం పీ యం అవార్డు” కోసం రెండు సార్లు షార్ట్‌లిస్ట్ చేయబడడం విశేషం.
సి ఎస్ ఆర్ నిధుల కింద కలెక్టర్ వ్యక్తిగత ఆసక్తి ఆధారంగా.. అనేక కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. పాఠశాలల్లో 5 కొత్త లైబ్రరీల స్థాపన, 45 లక్షలతో కోట దిబ్బ డిగ్రీ కళాశాలకు లెక్చర్ హాల్, జిల్లా అతిథి గృహం, ఉద్యోగుల కోసం జిమ్, నిరుపేద బాలల గృహం మొదలైనవి ఉన్నాయి.
పిల్లలు లేని తల్లిదండ్రులను అనాథ పిల్లలను దత్తత తీసుకునేలా ప్రేరేపించారు మరియు కోవిడ్ అనాథ పిల్లలకు సహాయాన్ని అందించడంలో విశేష కృషి చేశారు.
కైకలూరు , దెందులూరు నియోజకవర్గాలలో కొల్లేరు ప్రభుత్వ భూముల ఆక్రమణలను తీవ్రంగా వ్యతిరేకించి కొత్త ఆక్రమణల నుండి కొల్లేరును కాపాడడంలో అవిరళ కృషి చేశారు. భూగర్భ జల సామర్థ్యాన్ని మెరుగు పరచడానికి బహుళ వ్యవసాయ చెరువులు, అమృత్ సరోవర్ ట్యాంకులు మరియు వర్షపు నీటి నిల్వ నిర్మాణాలను సృష్టించడంలో ఎంతో చొరవ చూపారు. నేషనల్ హైవేస్ అథారిటీ ద్వారా గ్రీన్ ఫైల్ హైవేని త్వరితగతిన అమలు చేయడం లో భేష్ అయిన చర్యలు తీసుకున్నారు.
ఆయుష్మాన్ భారత్ (భారత ప్రభుత్వం) కింద, ‘ ఎన్ సి డి-సి డి సర్వే & ఏ బి హెచ్ ఏ హెల్త్ కార్డ్’లో ఏలూరు జిల్లా దేశంలోనే “మొదటి స్థానంలో” నిలవడంలో కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ సమర్థవంతమైన పని తీరు కు ఓ నిదర్శనం.
కలెక్టర్ చొరవతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నిధులు (NCAP) ద్వారా ఏలూరు పట్టణంలో 4 ఫౌంటైన్లు మరియు గ్రీనరీ ని అభివృద్ధి చేపట్టారు. ఉమ్మడి కృష్ణ జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలకు సంబందించి ఎన్ని సమస్యలు సృష్టించబడ్డా, అయితే సహనం & గౌరవాన్ని కొనసాగించి ప్రసన్న వెంకటేష్ ఎంతో హుందాగా వ్యవహరించారు. శాంతియుత పద్ధతిలో మరియు నిష్పక్షపాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఓటింగ్ శాతం 84.9%కి పెరిగింది, ఇది గత సాధారణ ఎన్నికల 2019 కంటే ఎక్కువ నమోదు కావడం విశేషం. అందుకే కలెక్టర్ ఏలూరు జిల్లా జనం మదిలో అందరివాడుగా మిగిలారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో..
ఎన్నికల్లో ఆయన పాత్ర కీలకం
ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో
జిల్లా ఎన్నికల అధికారిగా ప్రసన్న వెంకటేష్ కీలక భూమిక పోషించారు. నకిలీ ఓట్లను తొలగించడం, అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పిచడం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఓటు హక్కు నమోదు దగ్గర ప్రారంభించే కొత్త ఓటర్ల జాబితా విడుదలతో పాటు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా విమర్శలకు అవకాశం లేకుండా పకడ్బంధీగా ఓటర్ వెరిఫికేషన్ చేసేలా ఆయన కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేసిన తీరు ప్రశంసలందుకుంది. ఇదే సమయంలో జిల్లాలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ముందుగానే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది కేటాయింపు, ఈవీఎంల నిర్వహణ ఇలా ప్రతి అంశంలోనూ ఆయన తీసుకున్న ముందస్తు చర్యలు అందరి మన్ననలు పొందాయి. ఓటింగ్ పెరిగింది ఆయన ప్రణాళికతోనే.. ఏలూరు జిల్లాలో గతంలో లేని విధంగా ఓటింగ్ శాతం పెరగడానికి కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ముందు చూపే కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా యువ ఓటర్లకు ఓటు హక్కు కల్పించడంతోపాటు, వారు ఓటు వేసుకునేం దుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించి కేంద్రాలకు వచ్చే విధంగా ఆయన తీసుకున్న చర్యలే నేడు యువతరం పోలింగ్ కేంద్రాలకు పరుగు పెట్టేందుకు దోహద పడింది. కొత్తగా ఓటు హక్కు కోసం యువతను ఆకర్షించేందుకు జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఇదే సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా జిల్లాలోనే అత్యధికంగా
నమోదయింది. ఇందుకోసం ముందస్తుగానే ఆయన ప్రణాళిక బద్ధంగా ఉద్యోగులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు కలిగే ఇచ్చే విధంగా ఆయన చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో జిల్లాలో హోమ్ ఓటింగ్ పెంచేందుకు ఆయన ముందస్తు ప్రణాళికలతో కిందిస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా వ్యాప్తంగా హోం ఓటింగ్ కు
అనుహ్య స్పందన లభించింది. దీంతోపాటు సాధారణ ఓటింగ్ కూడా 84.9 శాతం పైగా పెరగడానికి గడిచిన ఏడాదిగా ఆయన చేస్తున్న కృషి కి నిదర్శనం.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in