Eluru:స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మరింత భధ్రత…
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డిజిపిలు నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి
ఏలూరు, మే,17:సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అనంతరం ఈవిఎంలు భధ్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ల భధ్రత మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలను ఆదేశించారు.
ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి శుక్రవారం సాయంత్రం సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు, వీవీప్యాట్‌ల సురక్షిత నిల్వ, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఐ.జి.లు, డి.ఐ.జి.లు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ప్రతిరోజు స్ట్రాంగ్ రూమ్ లను రిటర్నింగ్ అధికారులు సందర్శించి లాగ్ బుక్, వీడియో చిత్రీకరణలను నిర్వహించి జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలన్నారు.
ఏలూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మరియుజిల్లా ఎన్నికల అధికారి వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, జిల్లాలో శాంత భధ్రతలకు తీసుకోవల్సిన చర్యలను వివరించారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల్లో అవాస్తవాలు ప్రసారం జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్ చార్జి డిఆర్ఓ ఎన్ ఎస్ కె. ఖాజావలి, కలెక్టరేట్ ఎవో కె. కాశీవిశ్వేశ్వరరావు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి యం. ముక్కంటి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి కె. బాబ్జి ఎలక్షన్ సెల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in