EluruEluru
0 0
Read Time:4 Minute, 2 Second

Eluru:స్ట్రాంగ్ రూమ్ ల వద్ద అంతా కట్టుదిట్టం.

కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భధ్రతా ఏర్పాటు.

స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి. మేరీ ప్రశాంతి.

ఏలూరు, మే,18:సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఈవిఎం, వివిప్యాట్ లు భధ్రపరచిన సర్. సి.అర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లో స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీలు చేసి, భద్రతాపరమైన అంశాలలో సిబ్బందికి తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్బంగా సంబంధిత లాగ్ బుక్ లో కలెక్టర్, ఎస్పీ సంతకాలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భధ్రతా విషయంలో ఈవిఎంలు, వివిప్యాట్ ల సురక్షిత తదితర అంశాలపై జిల్లా ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించామన్నారు. ఏలూరు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ, ఏలూరు పార్లమెంటు నియోజవర్గాలకు సంబంధించి పోలింగ్ అయిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివిప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భధ్రపరచడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కాలంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై అధనపు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ నేపద్యంలో రాజకీయ హింసకు సంబంధించిన ఏదైనా సంఘటనకు స్పందించే క్రమంలో ప్రజలు, మీడియా, సంయమనం పాటించడం అత్యంత కీలకమన్నారు. ఈ విషయంలో ప్రతిఒక్కరూ బాధ్యతతో వ్యహరించాలన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్బంలో సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారికి, జిల్లా ఎస్పీ లకు ముందస్తు సమాచారం అందించాలని కోరారు. అదే విధంగా జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూము వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ లో వద్ద అప్రమత్తపుతో విధులు నిర్వహించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలలో మూడు అంచెల భద్రత ను ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు, స్ట్రాంగ్ రూమ్ చుట్టు పక్కల 144 సెక్షన్ అమలులో ఉన్నదని ప్రజలు ఎవరు సదరు కాలేజీ చుట్టుపక్కల సంచరించరాదని హెచ్చరించారు.
వీరి వెంట ఉంగుటూరు, ఏలూరు, కైకలూరు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్ ఎస్ కె ఖాజావలి, యం. ముక్కంటి, కె. భాస్కర్, ఎఆర్ఎఎస్పీ ఎస్ఎస్ శేఖర్, ఎఆర్ డిఎస్పీ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.

లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *