Eluru:నేడే పెంచిన 7 వేల రూపాయల పింఛన్ల పంపిణీ
పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ
ఏలూరు జిల్లాలో 2.68 లక్షల మందికి రూ.182.73 కోట్లు పంపిణీ
రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి
నూజివీడు,జూన్ 30:రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలు లో భాగంగా వృద్ధాప్య పింఛన్లు జూలై మాసానికి సంబందించి రూ.4వేలు ,గత మూడు నెలల ఏరియర్స్ రూ.3వేలు కలిపి మొత్తం 7 వేల రూపాయలు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జూలై 1వ తేదీ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి తెలిపారు.
ఏలూరు జిల్లాలో 2.68 లక్షల మందికి రూ.182.73 కోట్లు పంపిణీ కి అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
సోమవారం ఉదయం 6 గంటలకు పార్టీ నాయకులు ,మండల, గ్రామ వార్డు నాయకులు, అభిమానులు అందరూ సమన్వయంతో సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి ఉదయం 6 గంటలకు ఒక పండుగ వాతావరణంలో అవ్వ తాతలకు పింఛన్లు పంపిణీ చేసి పించనుదారుల కళ్ళలో ఆనందాన్ని నింపాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి అంతా కలిసికట్టుకొని పెద్ద ఎత్తున కదిలి రావాలని రాష్ట్ర గృహనిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు.
మంత్రివర్యులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే వివరాలు
1,ఉదయం : 6 గంటలకు నూజివీడు రూరల్ మండలం, పోతురెడ్డిపల్లి గ్రామంలో పింఛను పంపిణీ కార్యక్రమం.
2.ఉదయం 7:30 నిమిషాలకు నూజివీడు గాంధీనగర్ లో పింఛన్ పంపిణీ కార్యక్రమం
3.ఉదయం 10 గంటలకు ఆగిరిపల్లి పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in