Read Time:1 Minute, 16 Second
Eluru: జూలై, 01…. ది. 02-07-2024 వ తేదిన ఏలూరు 1 వ పట్టణం లో గల వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్ పరిదిలో కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం నిమిత్తం ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం

06:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపదల చేయబడునని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు జె.పి.బి. నటరాజన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమయములో వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్ పరిధి లో గల కొత్తగూడెం సెంటర్, 7 కాలవులు సెంటర్, చాటపర్రు రోడ్, తూర్పు వీధి సాయి బాబా గుడి సెంటర్, తూర్పు వీధి గంగానమ్మ గుడి ఏరియా, ఫిల్ హౌస్ పేట మరియు మాదేపల్లి రోడ్ పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడును. కావున వినియోగదారులు సహకరించవలసినదిగా ఆయన కోరారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in
