Eluru:జూలై 09: పరిశ్రమల్లో ప్రమాధాల నివారణకు భధ్రత చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లో పరిశ్రమలు, కార్మిక, కాలుష్యనియంత్రణ, ప్యాక్టరీస్ తదితర శాఖల అధికారులతో జిల్లా పరిశ్రమల భధ్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో అన్ని పరిశ్రమల్లో భధ్రత పటిష్టం చేయాల్సివుందన్నారు. ప్యాక్టరీలలో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాధాలకు దారితీయవచ్చన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తరచూ మాక్ డ్రిల్ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కార్మికులు, ప్రజల్లో ప్రమాదాల నివారణ, ప్రమాదాల సమయంలో చేపట్టాల్సిన అత్యవసరమైన చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. పరిశ్రమల్లో రక్షణ, ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోటోకాల్, ఖచ్చితంగా పాటించాలన్నారు. పరిశ్రమల లోపలే కాకుండా పరిశ్రమల చుట్టుప్రక్కలవున్న ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరింత భధ్రత చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో నూతనంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేటాయించల్సిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కాలుష్యనియంత్రణకు చేపట్టవలసిన పలు అంశాలపై కూడా కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.
సమావేశంలో డిప్యూటీ ఛీఫ్ ఇన్స్పేక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్. త్రినాధరావు , ఎపిఐఐసి జెడ్ఎం కె. బాబ్జి, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజరు వి.ఆదిశేషు, కాలుష్యనియంత్రణ మండలి ఇఇ వెంకటేశ్వరరావు, ఉప కార్మిక కమీషనరు పి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in