Eluru:జులై, 10 : వివిధ సంక్షేమ, అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షలు, కార్యాలయం పనుల్లో ప్రతీరోజూ ఎంత బిజీబిజీగా ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారానికి తోలి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. .
బుధవారం కలెక్టరేట్లో జిల్లాలో రైతులకు పంటరుణాలు, సంక్షేమ పధకాలు, పారిశ్రామికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, తదితర అంశాలపై బ్యాంకర్ల తో సమావేశం అనంతరం తన ఛాంబర్ కు వెళ్ళబోతున్న జిల్లా కలెక్టర్ ను కలిసి ఏలూరుకు చెందిన విభిన్నప్రతిభావంతురాలు ఏ . అనురాధ తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసానని, తన కుటుంబ ఆర్ధిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుని తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్ ను కోరగా, వెంటనే సదరు దరఖాస్తును పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విభిన్నప్రతిభావంతులు తమ దరఖాస్తులను కార్యాలయం పనివేళల్లో కలెక్టరేట్ లోని టప్పాల్స్ సెక్షన్ లో అందిస్తే సరిపోతుందని, వాటిని తనకు స్వయంగా అందించినప్పుడు ఎంత ప్రాధాన్యతతో పరిష్కారం జరుగుతుందో, టప్పాల్స్ సెక్షన్ లో అందించిన దరఖాస్తులను కూడా అంతే ప్రాధాన్యతతో పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in