Eluru: జులై 11:రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆదేశాల ప్రకారం గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు స్వాతి మహిళా అభ్యుదయ సంఘం మరియు జిల్లా అధికార సంస్థ సంయుక్తంగా మహిళా చట్టాలు పైన అవగాహన సదస్సును నిర్వహించారు.

ఈ సదస్సు నందు ట్రైనీ జడ్జిలు యం. రాజరాజేశ్వరి తేజస్విని, పి.వి.యస్.యన్. లక్ష్మీ లావణ్య మరియు పి.వి నాగ రంజిత్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి యం.రాజరాజేశ్వరి తేజస్విని మాట్లాడుతూ మహిళలు చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలని మహిళలు చదువుతో పాటు, సమాజంలో ప్రతి విషయం పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని అప్పుడే సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవచ్చని సూచించారు. ప్రతి బాలిక చిన్ననాటి నుంచే సమాజంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే విధంగా తర్ఫీదు పొందాలని ప్రతి అంశంలో పురుషులతో సమానంగా పోటీపడుతున్నప్పటికీ ఎక్కడో ఒకచోట సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, కావున సమస్యల పైన పోరాడాలని సూచించారు. నేటి సమాజంలో మానవ అక్రమాణ విరివిగా జరుగుతుందని మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు, నేటి సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలు నియంత్రించాలని కొందరు ఇటువంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని అటువంటి వారిపై చట్టం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు మరియు ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి మంగాకుమారి, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగమణి, స్వాతి మహిళా సంఘం ప్రాజెక్ట్ ఆఫీసర్ నవీన్ కుమార్ పానెల్ అడ్వకేట్ కూనా కృష్ణారావు మరియు పి.రత్న రాజు తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in