Eluru: జూలై, 16….ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ కోసం ఆసక్తిగల అభ్యర్ధులు జూలై, 24వ తేది వరకు ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
మంగళవారం స్ధానిక కలెక్టరేట్ లో ఎయిర్ ఫోర్స్ అధికారి ఎన్. సంధీప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ వాయువు రిక్రూట్ మెంట్ గురించి అధికారులకు వివరాలు తెలియజేశారు. ఈ సందర్బంగా సంబంధిత రిక్రూట్ మెంట్ సంబంధించిన మెటీరియల్ అందజేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ అగ్నివీర్ వాయువు రిక్రూట్ మెంట్ కు సంబంధించి జూలై 24వ తేదీ వరకు ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకునే విధంగా అన్ని కళాశాలల్లో 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం లోపు వయస్సు కలిగిన విద్యార్ధులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసరుకు సూచించారు. ఈ రిక్రూట్ మెంట్ వైమానిక దళంలోకి ప్రవేశించడానికి స్ధిరమైన వృత్తిని, దేశానికి సేవచేసే అవకాశాన్ని అందిస్తుందన్నారు.
ఎయిర్ ఫోర్స్ అధికారి ఎన్. సంధీప్ మాట్లాడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ వాయువు రిక్రూట్ మెంట్ సంబంధించి ఇతర వివరాలను https://agnipathvayu.cdac.in వెబ్ సైట్ లో పొంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. అక్టోబరు 18 నుంచి ఆన్ లైన్లో పరీక్షలు నిర్వహించబడతాయన్నారు.
సమావేశంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి జి. ప్రవీణ్ కృష్ణ, సెబ్ వెల్ మేనేజరు పి.వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in