Eluru:సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం పూర్తి భద్రత ఏర్పాట్లతో సర్వం సన్నద్ధం…
ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నాం…
వీడియో కాన్పరెన్స్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్.
ఏలూరు, మే 23 : ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి గురువారం సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, తదితరులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
ఏలూరు కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ , జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, పివో ఐటిడిఎ యం. సూర్యతేజ, డిఆర్ఓ డి.పుష్పామణి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు – 2024లో భాగంగా కౌంటింగ్ కోసం అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపడుతున్నామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ను ఏలూరు సమీపంలోని వట్లూరు లోని సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలలోని పలు విభాగాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని, ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాలలో బారి కేడింగ్ చేపట్టామని, కౌంటింగ్ కోసం తాగునీరు, భోజనం, తదితర అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద సిఏపిఎఫ్, ఎస్ఏపి, సివిల్ బలగాలను ఏర్పాటు చేశామని, అన్ని కౌంటింగ్ కేంద్రాలలో, స్ట్రాంగ్ రూముల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మరియు కౌంటింగ్ కోసం అడిషినల్ ఏఆర్ఓలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని, మొదటి ర్యాండమైజేషన్, శిక్షణా కార్యక్రమం ఈనెల 27వ తేదీన నిర్వహిస్తామన్నారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాల సన్నద్ధంగా ఉంటూ పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు.
సమావేశంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి యం. ముక్కంటి, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. అద్దయ్య, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వై. భవానీ శంకరి, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. భాస్కర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాబ్జి, కలెక్టరేట్ ఎవో కె. కాశీవిశ్వేశ్వరరావు, కలెక్టరేట్ లోని ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in