Eluru:సమాజంలో వైద్యవృత్తికి ఉన్న గౌరవానికి మరింత వన్నె తెచ్చే విధంగా ప్రజలకు మెరుగైన వైద్య
సేవలందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. జిల్లాలో పారిశుధ్యం, వైద్యసేవలు, విద్య, తదితర అంశాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రాణాపాయస్థితిలో ఉన్న వ్యక్తిని ప్రాణాపాయం నుండి రక్షించేది వైద్యుడిని, అటువంటి వైద్యుడిని ప్రతీ ఒక్కరూ దేవుడిగా కొలుస్తారన్నారు. అటువంటి వైద్యవృత్తిలో ఉన్న వైద్యసిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించే దిశగా వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. వైద్యులు,వైద్య సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నిర్దేశించిన సమయం వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది హాజరు నూరు శాతం ఉండాలన్నారు. ఆసుపత్రి పరిధిలో గర్భిణీలు, పిల్లలకు చేయవలసిన వాక్సినేషన్ పూర్తిగా అందించాలన్నారు. గర్భిణీలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ రక్తహీనత, తదితర ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై ఉందన్నారు. నూరు శాతం పిల్లలకు వాక్సినేషన్ పూర్తి చేయవలసి ఉండగా, లక్ష్యసాధనలో వెనుకబడిన బంగినపల్లితోట, రమణక్కపేట, ధర్మాజీగూడెం వైద్యాధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలలో చిక్కుకున్న కుక్కునూరు, వేలేరుపాడులలోని ప్రజలకు వైద్య సిబ్బంది ప్రజలకు ఉత్తమ సేవలందిస్తున్నారని, జిల్లాలోని మిగిలిన వైద్య సిబ్బంది వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. జిల్లాలో స్టాప్ డయేరియా క్యాంపైన్ లో భాగంగా జిల్లాలో మలేరియా, డెంగ్యూ వైరల్ జ్వరాలు వ్యాపించకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో వైద్య సేవల లోపం కారణంగా మాతా శిశు మరణాలు సంభవిస్తే సంబంధిత సిబ్బందిపై తీవ్రమైన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపడాలి : కలెక్టర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి మెరుగుపరచడంలో మండల విద్యా శాఖాధికారుల పాత్ర ప్రధానమైనదన్నారు. పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయి పరిశీలించి, వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ద తీసుకునేలా ప్రత్యేక పర్యవేక్షణతో ఎంఈఓ లు ఉపాధ్యాయులను ప్రేరణ చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల స్థాయి పెరగడం పెద్ద కష్టం కాదన్నారు. ఈ దిశగా కృషి చేసే ఎంఈఓ లకు ర్యాంకింగ్ లు కేటాయించి, ప్రతిభ కనపరచిన ఎంఈఓ లను అభినందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కానుక కిట్లు విద్యార్థులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కిచెన్ గార్డెన్స్ లో కాయగూరల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన కిచెన్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వర్షాకాలం కారణంగా సరుకులు పాడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనంలో బియ్యం, పప్పు,చిక్కి, కోడిగుడ్లు తదితరాలు వినియోగ సమయంలో పరిశీలించాలన్నారు. బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా బడిలోనే ఉండాలని, నూరు శాతం ఎన్రోల్మెంట్ తో జిల్లాలో డ్రాప్ ఔట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సంపూర్ణ పారిశుధ్య పారిశుధ్య పరిస్థితులు ఉండాలి: కలెక్టర్: ప్రస్తుత వర్షాకాలం సందర్భంగా జిల్లాలో అపరిశుధ్య పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో డ్రైన్లలో మురుగు నీరు నిల్వ లేకుండా శుభ్రం చేయించడం, రోడ్లపై చెత్త లేకుండా చూడాలన్నారు. దోమలు వ్యాపించకుండా ఎప్పటికప్పుడు ఫాగ్గింగ్ చేయించాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించేలా వాటర్ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలనీ, త్రాగునీటిని క్లోరినేషన్ చేయించాలన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ఠ, డీఈఓ అబ్రహం, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in