Eluru బాల కార్మికుల దుస్ధితి నుండి బయటకు తీసుకువచ్చి వారి ఉజ్వల భవిష్యత్ ను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి తెలిపారు. గురువారం కలెక్టరేట్ గౌతమీ. క సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
కె.వెట్రి సెల్వి సమావేశంలోజిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి మాట్లాడుతూ బాల కార్మికరహిత వ్యవస్ధ రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. విద్యాశాఖ, పొలీస్,కార్మిక శాఖ, బాలల హక్కుల పరిరక్షణ సంస్ధలు, సోషల్ వెల్పేర్ డిపార్ట్ మెంట్, వైద్యశాఖ, తదితర శాఖల అధికారులతో బాలకార్మికులను గుర్తించి వారిని పనులలోనుంచి పాఠశాలలోకి చేర్పించాలని తెలిపారు. అధికారులు తనిఖీలు నిర్వహించాలని దీనికి సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బాల కార్మికులను పనుల్లో పెట్టుకోవడం నేరమని వీటిని అతిక్రమించిన యాజమాన్యంపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని జిల్లా ఉప కార్మిక కమీషనరును కలెక్టర్ ఆదేశించారు.
బాల కార్మికులు ఉండే ప్రదేశాలను గుర్తించి తరచూ తనిఖీలు నిర్వహించాలని ఎక్కువగా బిక్షాటనచేసే బాలలను రైల్వే స్టేషన్, ఆర్ టిసి కాంప్లెక్స్ లోను అలాగే హోటళ్లు, కిరాణాషాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రదేశాలలో పనిచేసే వారిని గుర్తించాలని తెలిపారు. బడిమానేసిన పిల్లల జాబితాను విద్యాశాఖ ద్వారా తెప్పించుకొని పిల్లలను తిరిగి పాఠశాలల్లో జాయిన్ చేసేలాగా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని అన్నారు. ప్రధాన కూడలి వద్ద హోర్డింగ్స్, ఫ్యాక్టరీలలో, అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో కార్మిక శాఖ ఉప కమిషనర్ పి శ్రీనివాసు, జిల్లా అదనపు ఎస్పి స్వరూప రాణి
సోషల్ వెల్పేర్ జెడి జయప్రకాష్ డిసిపిఓ సిహెచ్ సూర్యచక్రవేణి, ఐసిడిఎస్ పిడి పద్మావతి, డెమో డాక్టర్ నాగేశ్వరావు, వివిధ శాఖల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in