Eluru:ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా, నిర్వహించి విజయవంతం చేయాలి
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

ఏలూరు, మే, 23 : జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల కమీషన్ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్ లోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, పివో ఐటిడిఎ యం. సూర్యతేజ, డిఆర్ఓ డి. పుష్పామణి తో కలిసి జిల్లాలో 7 నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో జూన్ 4వ తేదీన ఏలూరు సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందునుంచే పరిశీలించుకోవాలని తగు జాగ్రత్తలు పాటించి కౌంటింగ్ సరళిలో సమయాన్ని వృధాకాకుండా చూచుకోవాలన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో వెబ్ కాస్టింగ్, రౌండ్ల వారీగా టేబుల్స్, కౌంటింగ్ సూపర్ వైజర్లు, అసిస్టెంట్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ ప్రక్రియకు ఉపయోగించే వస్తువులు, తదితర అంశాలను రిటర్నింగ్ అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధతీసుకొని పర్యవేక్షించుకోవాలని కలెక్టర్ సూచించారు. కౌంటింగ్ కు అవసరమైన వస్తువులయొక్క చెక్ లిస్టును తయారుచేసి రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని డిఆర్వోను కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ రౌండు వారీగా సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు అందించడానికి అవసరమైన ఇంటర్నెట్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. కౌంటింగ్ కు కేటాయించిన అధికారులు, సిబ్బందికి పూర్తిస్ధాయిలో అవగాహన కలిగే విధంగా శిక్షణ అందించాలని తెలిపారు.
సమావేశంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి యం. ముక్కంటి, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. అద్దయ్య, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వై. భవానీ శంకరి, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె. భాస్కర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బాబ్జి, కలెక్టరేట్ ఎవో కె. కాశీవిశ్వేశ్వరరావు, కలెక్టరేట్ లోని ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in