Eluru District Court:ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ లో 1538 పెండింగ్ కేసుల పరిష్కారం.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్ వెల్లడి:

ఏలూరు/ జూన్ 30; జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ జస్టిస్ బి కృష్ణమోహన్ గారి ఆదేశానుసారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏలూరు వారి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 29వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు జిల్లా వ్యాప్తంగా 35 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగినది. వీటిలో
ఏలూరు లో 9 బెంచీలు, భీమవరం 5, కొవ్వూరు 3 నరసాపురం 4, తణుకు 4 తాడేపల్లిగూడెం 5, పాలకొల్లు 1, నిడదవోలు 1, జంగారెడ్డిగూడెం 1, చింతలపూడి 1 మరియు భీమడోలు 1 కోర్టుల చొప్పున బెంచిలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆదివారం తెలియజేశారు.
జాతీయ లోక్ అదాలత్ నందు జిల్లావ్యాప్తంగా కేసులను రాజీవ్ చేయడం జరిగిందని, అందులో 1538 పెండింగ్ కేసులను పరిష్కారం చేయడం జరిగిందని వీటిలో 1254 క్రిమినల్ కేసులు,129 మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, 153 సివిల్ కేసులను రాజీ చేయగా 102 ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారించబడ్డాయని తెలిపారు. వీటిలో
ఏలూరు 568, భీమవరం
172, చింతలపూడి 55, జంగారెడ్డిగూడెం 61, కొవ్వూరు 120, నర్సాపురం 105, పాలకొల్లు 70, తాడేపల్లిగూడెం 184, తణుకు 129, నిడదవోలు 37 మరియు భీమడోలు 37 కేసులు (పెండింగ్ కేసులను)
ఈజాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించామని తెలిపారు.వీటితో పాటుగా జిల్లా వ్యాప్తంగా 2356 పెట్టి కేసులను కూడా రాజీ చేయడం జరిగింది. ఈ జాతీయా లోక్ అదాలత్ నందు కేసులను ఆన్లైన్ ద్వారా 10 కేసులను పరిష్కరించడం జరిగిందని, తాడేపల్లిగూడెం కోర్టుకు సంబంధించిన కేసులలో కక్షిదారులు ఏలూరు నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై తమ కేసులను రాజీ చేసుకున్నట్లుగా తెలియజేశారు అలాగే కక్ష దారులు ఇకముందు కూడా ఇటువంటి ఈ ఆన్లైన్ విధానం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని తద్వారా సమయము డబ్బు ఆదా అవుతుందని తెలియజేశారు. వాహన ప్రమాద బీమా కేసులలో 8 కోట్లకు రూపాయలకు పైగా పరిహారం కింద చెల్లించడం జరుగుతుందని తెలియజేశారు.
జాతీయ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, పోలీస్ అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, ఇన్సూరెన్స్ అధికారులకు, బ్యాంకు అధికారులకు, చిట్ ఫండ్ ప్రతినిధులకు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, బిఎస్ఎన్ఎల్ వారికి, జిల్లా పంచాయతీ శాఖ వారికి, పత్రిక విలేకరులకు, ఆల్ ఇండియా రేడియో విజయవాడ వారికి, రవాణాశాఖ అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు, రైల్వే శాఖ అధికారులకు, అడ్వకేట్ క్లర్కు లకు, అగ్రికల్చరల్ అధికారులకు మరియు మిగతా శాఖల అందరికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తమ కుమార్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ-కం- సీనియర్ సివిల్ జడ్జి కె.రత్న ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in