Eluru ICDS:ఏలూరు/జూన్ 30: దీనులు చైల్డ్ హెల్ప్ లైన్ చెంతకు
బందరు, యానాదుల కు చెందిన కుటుంబాలు సుమారు పది హేను ఏళ్ల క్రితం చింతలపూడి వలస వచ్చారు. 15 సంవత్సరాలుగా వీరు చింతలపూడి లో ఉంటూ ప్లాస్టిక్ ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి ఏటువంటి ఆధార్ కార్డు లు,ఇతర ఏమి లేవు.
భిక్షాటన చేస్తూ,చెత్త ప్లాస్టిక్ ఎరుకుంటున్నారు.ఆయా స్వచ్ఛంద సంస్థలు అందించే ఆహారం తీసుకొని జీవం గడుపుతున్నారు. వీరిలో
తమ్మీ శెట్టిలక్ష్మి,పోలయ్య దంపతులకు ఆరుగురు సంతానం.
అందరు చిన్న పిల్లలే
వయసు రీత్యా ముప్పై ఏళ్ళు లేని ఈ దంపతులకు ఆరుగురు సంతానం.వీరు చింతలపూడి మినీ బస్టాండ్ లో తల దాచుకుంటున్నారు.
వీరిని గమనించిన చింతలపూడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు,అజీమ్ చారిటీ చైర్మన్ అజాద్ వీరికి అన్ని సదుపాయాలు కల్పించాలని సంకల్పంతో చారిటబుల్ సభ్యులు లైన జి.లక్ష్మణ్,సాయి , సహకారంతో వారికి 2020 లో ఆధార్ కార్డు లు, తద్వారా రేషన్ కార్డులు ఇప్పించారు.వీరికి అప్పట్లో తహశీల్దార్ పోరంబోకు స్థలం ఇచ్చినా అది ఊరికి దూరం కావడంతో వారు మినీ బస్టాండ్ లోతలదాచుకుంటున్నారు,అయితే ఇటీవల వీరి ఆరుగురు సంతానం లో ఒకరైన తమ్మీ శెట్టి రాములమ్మ (7) కుక్క కాటుకు గురై తల్లి దండ్రులు బాధ్యత రాహిత్యం వల్ల అనారోగ్యంతో ఈ నెల 25 వ తేదిన మృతి చెందింది.రాములమ్మ మృతికి తీవ్ర మనస్తాపం చెందిన అజీమ్ చారిటీ అజాద్ స్థానిక మీడియా సహకారంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సి హెచ్. సూర్య చక్ర వేణి చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు ను శనివారం లక్ష్మి పోలయ్య లతో సహా సంతానం ను ఏలూరు జిల్లా బాలల సంరక్షణ అధికారి అదేశముల ప్రకారం చైల్డ్ హెల్ప్ లైన్ అధికారి వైవీ రాజు స్థానిక మహిళా పోలీస్ సమక్షంలో పంచనామా రాసి ఏలూరు తీసుకెళ్ళారు.
వీరికి అజీమ్ చారిటీ సభ్యులు లక్ష్మణ్ ,సాయి లు సహాయపడ్డారు .
భిక్షాటన చేసే వారికి గుర్తింపు ఇచ్చి ,మృతి చెందిన రాములమ్మ లాగ ఇతర పిల్లలు కాకూడదు అని భావించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా అజీమ్ చారిటీ వారిని స్థానికులు అభినందించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in