Eluru July 11: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, సిట్ వెల్, ఏలూరు వారి ఆధ్వర్యములో గురువారం ఆదిత్య డిగ్రీ కళాశాల సత్రంపాడు, ఏలూరు నందు ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించినట్లు సెట్ వెల్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి సి. మదుభూషణ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వర రావు, డి.యస్.డి ఓ. జి .సుధాకర్, నేషనల్ కెరీర్ సర్వీసు జిల్లా కోఆర్డినేటర్ జి. ప్రవీణ్ కృష్ణ, వి వరలక్ష్మి, ఇ.ఒ వెకెషనల్ గైడెన్స్ కోర్స్, సెట్ వెల్ మేనేజర్ పి.వి.యన్. సత్యనారాయణ ప్రపంచ జనాభా దినోత్సవం గూర్చి మాట్లాడారు.
ప్రపంచ జనాభా దినోత్సవంపై వకృత్వం, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించటం జరిగినది. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ప్రదమ, ద్వితీయ మరియు తృతియ బహుమతి ప్రదానం చేయుట జరిగినది.
కార్యక్రమములో సెట్ వెల్ పర్యవేక్షకులు కె.జె. కెన్నెడీ, పసుపులేటి ప్రసాద్ ఆదిత్య కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in