Eluru July 12:ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్య నభ్యసించిన విద్యార్థులకు జాతీయ స్థాయి సంస్థలలో సీటు సంపాంచే స్థాయిలో విద్య అందించేలా అధ్యాపకులు మెరుగైన బోధన చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ తో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా బోధన, విద్యా ఫలితాలు, కాంట్రాక్టు లెక్చరర్స్ సేవల కొనసాగింపు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రస్తుతం అందిస్తున్న విద్యాబోధన కన్నా మరింత మెరుగైనస్థాయిలో విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన ఉతీర్ణత ఫలితాలు సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న లెక్చరర్స్ సేవలను నిబంధనలకు అనుగుణంగా కొనసాగించాలని, విద్యార్థులు సాధించిన ఉతీర్ణతా శాతం ఆయా అధ్యాపకులు కొనసాగింపులో పరిగణనలోనికి తీసుకోవాలన్నారు. 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన అధ్యాపకులు బదిలీలపై కౌన్సిలింగ్ నిర్వహించారు.
సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ టి.కె. విశ్వేశ్వరరావు, గిరిబాబు, శ్రీనివాసరావు, మహేంద్ర, ప్రభృతులు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in