Eluru July 13:ఇటీవల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెట్రీ సెల్వి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసిన సంగతి విధితమే.
ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో ఉప్పలపాడు వద్ద ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయని వాట్సాప్ నెంబర్ కు సహాయ పౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు సందేశాన్ని పంపించడం జరిగింది. ఈ విషయాన్ని పరిగణంలోకి తీసుకున్న అధికార యంత్రాంగం 24 గంటల్లోనే ఆ ఎండిపోయి ఉన్న చెట్లను తొలగించడం జరిగింది. ఇదే విషయంపై గత రెండు సంవత్సరాలుగా అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వాట్సాప్ సందేశం ద్వారానే సమస్యను పరిష్కరించినందుకు మధు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదేవిధంగా ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో తడికలపూడి వద్ద నుండి దేవులపల్లి వరకు రోడ్లన్నీ గుంతల మయంగా మారి ప్రమాదకరంగా ఉన్నాయని రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు చేయించాలని మధు కోరారు. అలాగే ఇదే రోడ్డులో రావికంపాడు, నారాయణపురం, తడికలపూడి సమీపంలో ఎండిపోయి ఉన్న చెట్లను కూడా తొలగించాలని మధు కోరారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in