Eluru July 13:ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తం కుమార్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో అనగా ఏలూరు,
పశ్చిమగోదావరి మరియు తూర్పుగోదావరి జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులతో శనివారం కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి ఐ. శ్రీనివాసమూర్తి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ కుమార్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనము నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నాన్ బెల్ బుల్ వారెంట్లు పెండింగ్ ఉన్నాయని, వాటిని అమలు పరచడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని, అలాగే సాక్షులుగా ఉన్న ప్రభుత్వ అధికారులు, వారు పని చేసే స్థానాలను గుర్తించి సమన్లు అమలు చేయడం ద్వారా కేసుల పరిష్కారాన్ని ముందుకు తీసుకు వెళ్ళొచ్చని, ఖైదీల ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టడం, సమన్లను యన్-స్టెప్ ద్వారా అమలు చేయడం వల్ల త్వరితగరితన కేసులను పరిష్కరించవచ్చని సూచించారు, పోలీసు అధికారులు ఆన్లైన్ విధానాన్ని ఉపయోగించుకొని కేసుల పరిష్కారానికి సహకరించాలని సూచించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in