Eluru July 21:బారీ వర్షాలు, వరదలు కారణంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాల మేరకు వేలేరుపాడు మండలంకు చెందిన 9 మాసాలు నిండిన ఎం. సీత గర్భిణీ అమ్మాయిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.
అదే విధంగా కుక్కునూరులోని ఇద్దరు బాలింతలను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని డిఎంహెచ్ఓ డా. శర్మిష్ట తెలిపారు. భారీ వర్షాలు, వరద ముంపు ప్రాంతాలైన గ్రామాల్లోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైన వైద్య సేవలు ప్రభుత్వ పరంగా అందించే ఏర్పాట్లను ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. శర్మిష్ట పరిశీలించారు. వేలేరుపాడు మండలం దాచారంలో ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా వైద్యులు, ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లను ఉద్దేశించి మాట్లాడుతూ వరద బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దాచారం ఆర్ అండ్ ఆర్ కాలనీ పునరావాస కేంద్రంలో వైద్య సేవలు నిమిత్తం రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కుక్కునూరులో ఎ బ్లాక్ లో ఒక వైద్య శిబిరం, వేలేరుపాడు పిహెచ్ సి సమీపంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు, ఈ శిబిరాలకు 28 మంది వైద్యాధికారులను , సిబ్బందిని నియమించామన్నారు. వేలేరుపాడులో 15 మంది, కుక్కునూరులో 13 మంది ఉన్నారని తెలిపారు. 16 మందిని డిప్యూటేషన్ పై వైద్య సేవలు కోసం వినియోగిస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరాల్లో 8 మంది ప్రత్యేక డాక్టర్లను నియమించడం జరిగిందని వీరితో పాటు ఎఎన్ఎంలను, ఆశా వర్కర్లను వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. అవసరమైన అత్యవసరనమైన మందులను కూడా అందుబాటులో ఉంచామన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in