Eluru July 23: వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఏ సమయంలో ఏ విధమైన అసౌకర్యం కలిగినా ప్రతి నివాసిత ప్రాంతానికి ఒక ప్రత్యేక అధికారిని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారు నియమించడం జరిగిందని వారి ద్వారా మీ సమస్యలు జిల్లా యంత్రాంగమునకు తెలియపరిస్తే సత్వరమే మీకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని డిఆర్డిఏ పిడి, వేలేరుపాడు మండలం వరద ప్రత్యేక అధికారి డా. ఆర్. విజయరాజు తెలిపారు.
మంగళవారం వేలేరుపాడు మండలం లో గత 4 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జల దిగ్బంధంలో ఇరుక్కున గ్రామాలైన కట్కూరు, కోయిదా గ్రామాలలో జంగారెడ్డిగూడెం ఆర్. డి.ఓ కె. అద్దయ్య, సివిల్ సప్లైస్ డి.ఎస్. ఓ ఆర్. ఎస్.ఎస్. రాజు, తహసీల్దార్ చిన్నారావు, యం.పి.డి.ఓ లతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సహాయ పునరావాస కార్యక్రమాల్లో భాగంగా 18 బోట్లు, 12 జనరేటర్స్ సిద్దంగా ఉంచామని, 2 లాంఛీ ల ద్వారా నిత్యావసర వస్తువులైన కూరగాయలు, వాటర్ ప్యాకెట్స్, టార్పాలి న్స్, దోమల చక్రాలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, రైస్ అడ్వాన్స్ పంపిణి క్రింద వరద బాధితులకు పంపిణి చేయడమైనదన్నారు. . వరద బాధితులతో ఆయన మాట్లాడుతూ మీకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేయడమైనదని వారిలో దైర్యం నింపారు. అదే విధంగా ఏ విధమైనా అనారోగ్యం సమస్యలు ఎదురైనా మెడికల్ డిపార్ట్ మెంట్ ద్వారా నర్సు ని మరియు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచడమైనదన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in