Eluru July 25 : జిల్లాలో గోదావరి నదికి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతున్న దృష్ట్యా ముంపు ప్రమాదం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద నీటి మట్టం గురువారం సాయంత్రానికి 48. 6 అడుగులకు చేరుకోవడంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నదని, ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని వరద ముంపు ప్రమాదం కలిగిన గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, సహాయక కేంద్రాలలో ఉంచాలన్నారు. సహాయక కేంద్రాలకు దూరంగా ఉన్నవారికి వారి కోరిక మేరకు, రహదారి సౌకర్యం లేని గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులు వారి ఇళ్లకు పంపాలన్నారు. వరద సహాయ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు. వరద ప్రమాదం తగ్గే వరకు అధికారులందరూ అప్రమత్తం ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. వాగులవద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున, కాజ్ వే ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలనీ, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న కాజ్ వే లపై ప్రజలు ప్రయాణించకుండా బారీకేడ్లతో మూసివేయాలన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in