Eluru July12:జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి మీటింగ్ హల్ నందు శుక్రవారం జిల్లాలో గల వైద్యాధికారులు మరియు స్టాఫ్ నర్సు లకు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం చిన్న పిల్లల వైద్యాధికారి డాక్టర్ సిర్రా. ఆల్బర్ట్. అప్పుడే పుట్టిన పిల్లలు లో వచ్చే పుట్టుక లోపాలు మరియు వాటికి ఇచ్చే వైద్యం గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది..
ఈ శిక్షణ ద్వారా లోపాలతో పుట్టిన పిల్లలకు సత్వర చికిత్స అందించడం ద్వారా వారి పుట్టుక లోపాలను సవరించి వారికి ఉన్నత జీవితం ఇవ్వవచ్చు అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ ఎస్.శర్మిష్ఠ తెలిపారు…
పుట్టుక నుంచి 18 సంవత్సరముల వరకు గల పిల్లలకూ ఏలూరు జిల్లాలోని జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలు ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం నందు చికిత్స అందించడం జరుగుతుంది అని జిల్లా ఆర్.బి. ఎస్.కె ప్రోగ్రాం అధికారి డాక్టర్ కుర్రా.నరేంద్ర కృష్ణ తెలిపారు.. అలాగే ఈ చికిత్స కేంద్రంల ద్వారా లోపల గల పిల్లలకూ ఉచిత చికిత్స మరియు అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్స్ చేయించబడును అని జిల్లా మేనేజర్ బొప్పన.నరేష్ తెలిపారు ..
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.శర్మిష్ఠ
జిల్లా ఆర్. బి. ఎస్.కె ప్రోగ్రాం అధికారి డా: కుర్రా.నరేంద్ర కృష్ణ
జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం చిన్న పిల్లల వైద్యాధికారి డా: సీర్రా.ఆల్బర్ట్
జిల్లా ఆర్.బి.ఎస్.కె ప్రోగ్రాం మేనేజర్
నరేష్. బొప్పన
పాల్గొన్నారు..
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in