Eluru Municipality:జూలై, 16… జూలై 2024, నుండి 31, ఆగస్టు, 2024 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం లో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) వారి ఆదేశాల మేరకు మలేరియా విభాగం వారితో 14వ డివిజన్ పోణంగి లోని హరిజన పేట, వెలమపేట, ఎస్సీ కాలనీ, సాయబు పేట, సవర్లపేట, కాపు పేట, పాత పోణంగి తదితర ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూనలకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్టు కింద ఫాగింగ్, ఖాళీ స్థలలోఉన్న నిలవనీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగినది.
కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆర్ .మాలతి , నాయకులు సాంబశివరావుగారు,బోసు బాబు , మలేరియా ఇన్స్పెక్టర్ దత్తి వేణుగోపాల్ స్వామి , మలేరియా సూపర్వైజర్ డి. దుర్గారావు, మరియు కె.శ్రీనివాసరావు ,టి. శ్యామ్ గారు, ఆరోగ్య కార్య దర్శి, ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in