Eluru Municipality: 1 జూలై 2024, నుండి 31, ఆగస్టు, 2024 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం లో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) వారి
ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా విభాగం వారితో 28వ డివిజన్ లోని ద్వారకా నగర్, బీడీ కాలనీ , వాణి నగర్, తదితర ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూనలకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్టు కింద ఫాగింగ్, ఖాళీ స్థలల్లోఉన్న నిల్వనీటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందని మున్సిపల్ హెల్త్ ఆఫీసరు మాలతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమంలో కార్పోరేటర్ తంగిరాల సురేష్, మలేరియా ఇన్స్పెక్టర్ దత్తి వేణుగోపాల్ స్వామి , మలేరియా సూపర్వైజర్ డి. దుర్గారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సోమేశ్వరరావు, ఆరోగ్య కార్య దర్శి, ఆశా కార్యకర్తలు , డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
లేటెస్ట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్త్ టిప్స్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మా సైట్ ని విసిట్ చేస్తూ ఉండండి www.oneindiaone.in